- Step 1
ముందుగా నానబెట్టిన బఠానీలని, ఆలూ, టొమేటోలతో కలిపి కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- Step 2
ఆలూ చెక్కు తీసి.. మరీ చిన్న ముక్కలు కాకుండా, మరి పెద్దవి కాకుండా, మీడియం సైజులో కట్ చేయాలి.
- Step 3
టొమాటోని చిన్న ముక్కలుగా చేయాలి. అలా ఉడికిన బఠానీమిశ్రమాన్ని తీసి మెదిపి (అంటే కొన్నిటిని మెత్తగా చేయటం) పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు బాణలిలో నూనె వేసి కొంచం వేడి కాగానే శనగపిండి వేసి వేయించాలి.
- Step 5
నూనెలో వేయగానే సెనగపిండి ముద్దగా అవుతుంది. అయనాపచ్చి వాసన పోయేదాకా అంటే సుమారు 5 నిమిషాలు వేయించాలి.
- Step 6
ఆ తర్వాత బఠానీ ఉడికించిన నీటిని కొంచం శనగపిండిలో వేస్తే అది ఉడుకుతుంది.
- Step 7
అలా రెండు నిమిషాలు అయ్యాక, మెదిపి పక్కన పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని అందులో వేయాలి.
- Step 8
ఇప్పుడు ఉప్పు, కారం, కసూరి మేతి, అమ్చూర్ పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు సన్న మంట మీద ఉంచాలి.