- Step 1
ముందుగా క్యాలీఫ్లవర్‌ను కట్ చేసుకుని కడిగి తర్వాత దానిలో పచ్చి బఠానీలు వేసి ఉడికించుకోవాలి.
- Step 2
తరువాత జీడిపప్పు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కొబ్బరి తురుము, ఎండుమిర్చి , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి నూనె వేసి మెంతులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుని తరువాత టొమేటో గుజ్జు, ఉప్పు, కారం వేసి కలపాలి.
- Step 4
ఐదు నిమిషాల తరువాత ఉడికించిన క్యాలీఫ్లవర్ బఠానీలు వేసి వేయించాలి.
- Step 5
ఆ తర్వాత మసాలా పేస్ట్ వేసి సరిపడా నీళ్లుపోసి ఉడికించాలి.
- Step 6
ఐదు నిమిషాలపాటు ఉడికించిన తరువాత గ్రేవీ చిక్కబడుతుంది. అప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.