- Step 1
ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్ప, కారం, వాము కొద్దిగా నీళ్లు పోసి కలపాలి.
- Step 2
తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి కాగిన తర్వాత కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- Step 3
తర్వాత ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
- Step 4
తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ వేసి వేగాక మొత్తం గ్రేవీలాగా అవుతుంది.
- Step 5
ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న క్యారట్ మంచూరియాలను వేసి కలిపి బౌల్‌లోకి తీసుకోవాలి. * ఆ మిశ్రమంలో కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ వెరైటీ క్యారట్ మంచూరియా రెడీ.