- Step 1
పెసలు వంటి గింజలని నానబెట్టి, ఆ తర్వాత మొలకలు వచ్చాక ఈ చాట్ చేస్తే బావుంటుంది.
- Step 2
వేరుసెనగలని మాత్రం కొంచం ఉడక బెట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. కాబట్టి వేరుసెనగలలో కొంచం ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 3
ఉల్లి, టమాటోలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు బాణలిలో నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించి, ఆ తర్వాత ఉల్లి, టమాటో లని కూడా వేసి ఒక్క నిమిషం పచ్చి వాసన పోయే దాక వేయించాలి.
- Step 5
ఆ తర్వాత ముందు ఉడికించిన వేరు శనగలని, ఆ తర్వాత మొలకెత్తిన గింజలని వేసి కలపాలి.
- Step 6
ఉప్పు, కారం, చాట్ మసాలా, డ్రై మాంగో పౌడర్ కూడా వేసి కలపాలి.
- Step 7
గింజలు వేసాక రెండు నిముషాలు ఉంచాలి అంతే. ఆ తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి రెండు నిముషాలు ఉంచితే ఆ వేడికి గింజలు కొంచం మగ్గుతాయి. పూర్తిగా పచ్చిగా కాకుండా, అలా అని పూర్తిగా మెత్త గా కాకుండా వుండి, ఈ చాట్ తినటానికి రుచిగా వుంటుంది .