- Step 1
పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగు విజిల్స్ వచ్చెవరకు కూక్కల్లో పెట్టుకోవాలి.
- Step 2
ఉల్లిపాయ, టమాటా, బెండకాయ మరియు పచ్చిమిరపకాలను తరిగి ప్రక్కన పెట్టుకోవాలి.
- Step 3
బాణలిని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేసి కలిపి ఒక్క నిమషం మూతపెట్టుకోవాలి.
- Step 4
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరవాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మరో రెండు నిమషాలు మూత పెట్టుకోవాలి.
- Step 5
టమాట బాగా మగ్గిన తరవాత బెండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి.
- Step 6
కుక్కర్ చల్లారిన తరవాత ఉడికిన పెసరపప్పును తీసి బాగా మెదిపి, వుడుకుతున్న బెండకాయలో వేసి నాలుగువైపుల కలిపి, చింతపండు గుజ్జు వేసి, రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరగపెట్టాలి.
- Step 7
తరువాత కారం, ధనియాల, జీలకర్ర, కరివేపాకు వేసి ప్రక్కన పెట్టుకోవాలి.
- Step 8
మరో బాణలిని పోయి మీద పెట్టి, నెయ్యి వేసి ఇంగువా, మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి, పెసరపప్పు బెండకాయ పులుసులో కలుపుకోవాలి.
- Step 9
చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే పెసరపప్పు బెండకాయ పులుసు రెడీ!