- Step 1
ముందుగా క్యాబేజీ తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి నూరి ఉంచాలి. అలాగే పచ్చి బఠాణీలు కూడా ఉడికించాలి.
- Step 2
ఇప్పుడు ఒక బాణలీలో నూనె పోయాలి. నూనె కాగిన తరువాత పోపు దినుసులు వేయించాలి.
- Step 3
తర్వాత అందులో క్యాబేజీ వేసి ఉడికించాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి వేసి వేగనివ్వాలి.
- Step 4
దీనిలో ఉడికించిన పచ్చి బఠాణీలు, ఉప్పు, చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి.
- Step 5
క్యాబేజీ కూర రెడీ అయిన తరువాత బ్రెడ్ ముక్కలను నీళ్ళలో ముంచి తీసి రెండు ముక్కల మధ్య క్యాబేజీ కూరను పెట్టి నొక్కి ఉంచాలి.
- Step 6
ఇప్పుడు శనగపిండి, బియ్యపుపిండిని బజ్జీల పిండి మాదిరిగా కలపాలి.
- Step 7
ఒక బాణలీలో నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో కూరతో నొక్కిన బ్రెడ్ ముక్కలను ముంచి నూనెలో వేసి వేయించాలి.
- Step 8
అంతే ఎంతో రుచికరమైన క్యాబేజీ బ్రెడ్ బజ్జీలు సిద్దం. వీటిని టొమేటో సాస్‌లో నంచుకుని తింటే... అబ్బబ్బ... ఆ టేస్టే వేరు!