- Step 1
ముందుగా పొట్లకాయను శుభ్రంగా కడిగి రింగులు రింగులుగా కట్ చేసుకోవాలి.
- Step 2
పొట్లకాయలో వున్న గింజలు తీసివేసి, ఉప్పు రాసుకోవాలి.వాటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన వుంచుకోవాలి.
- Step 3
ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి.
- Step 4
తర్వాత బఠాణీలు, క్యారెట్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని, పొట్లకాయ ముక్కలను మరొక గిన్నెలో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 5
అలాగే బంగాళాదుంపలను కూడా కట్ చేసి కుక్కర్‌లోనే ఉడికించాలి.
- Step 6
బంగాళాదుంపల ముక్కలు చల్లారిన తరువాత వాటి తోలు తీసి మెత్తగా ముద్ద చేసుకోవాలి.
- Step 7
బియ్యపుపిండి, శనగపిండిలో తగినన్ని నీళ్ళు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 8
ఒక బాణలిలో నునె పోసి కాగిన తరువాత ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసి వేయించుకోవాలి.తరవాత గరంమసాలా, లవంగాలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- Step 9
ఈ మిశ్రమంలో బంగాళాదుంప ముద్ద వేసి బాగా కలిపిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి.
- చివరికి కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలలో ఈ కూర ముద్దను కూర్చి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ మసాలా రోల్స్ రెడీ.