- Step 1
ముందుగా క్యాప్సికం, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలుగా కోసుకోవాలి.
- Step 2
స్టవ్ మీద బాణెలి పెట్టి నూనె వేసి వేడయ్యాక. ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
- Step 3
ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి చిన్న మంటమీద పది నిమిషాలు వేయించాలి.
- Step 4
తరువాత టొమోటో ముక్కల్ని కూడా అందులో వేసి మరో ఐదు నిమిషాలు మగ్గబెట్టాలి.
- Step 5
ఆపై తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టి షాజీరా దాల్చిన చెక్క పొడి, ధనియాలపొడి, కొబ్బరిపొడి, పసుపు కలపాలి.
- Step 6
కూర దగ్గరికి వచ్చేదాకా చిన్నమంటమీద అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే క్యాప్సికమ్ కర్రీ రెడీ.