- Step 1
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పదినిమిషాలు నానబెట్టాలి.
- Step 2
తర్వాత బంగాళా దుంపలు, క్యారెట్‌ను శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
అలాగే పాలకూర, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి.
- Step 4
ఇప్పుడు పాన్‌లో నూనె పోసి వేడయ్యాక మసాలా దినుసులు వేయించాలి.
- Step 5
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- Step 6
అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత పాలకూర, పొటాటో, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి.
- Step 7
అందులోనే చిటికెడు పసుపు, కారం, గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలపాలి.
- Step 8
ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మరిగిన తర్వాత బియ్యం, తగినంత ఉప్పు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
- Step 9
ఆ తర్వాత క్రిందికి దింపుకొని ఆవిరి అంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాలక్ పొటాటో పలావ్ రెడీ.