- Step 1
ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని రెండుసార్లు కడిగి నీరు వంచి పెట్టుకోవాలి.
- Step 2
పాన్లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర వేసి వేగిన తరువాత జీడిపప్పు, పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి.
- Step 3
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరవాత క్యారెట్ ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి.
- Step 4
ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి.
- Step 5
తర్వాత రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పు, కాస్తంత పసుపు చేర్చి మూతపెట్టి మరిగించుకోవాలి.
- Step 6
ఈ మిశ్రమంలో అటుకులు వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.