- Step 1
ముందుగా ఆలూని, బఠానీలని విడివిడిగా ఉడికించుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 3
తరువాత ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ గుజ్జు, ఉడికించిన బఠానీలు కూడా కలిపి, కొంచెం పసుపు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి కర్రీ చేసుకోవాలి . *ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ చివర్లు కట్ చేసి వాటి పైన తయారు చేసిన ఆలూ కర్రీని పెట్టి బ్రెడ్ స్లయిస్ కార్నర్ నుండి రోల్ లాగా చుట్టుకోవాలి .
- Step 4
ఇలా అన్నిటిని రెడీ చేసిపెట్టుకోవాలి .
- Step 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వెన్న వేసి, బ్రెడ్ రోల్స్ ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తరువాత వాటిని రౌండ్‌గా కట్ చేసుకోవాలి.