- Step 1
ముందుగా ఒక గిన్నెలో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 2
ఈ ఉడికించిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వడగట్టి జ్యూస్ తీయాలి.
- Step 3
తరువాత టమాటా జ్యూస్‌ను వేడి చేసి సగందాకా ఇగిరేలా చెయ్యాలి.
- Step 4
అలాగే అందులోనే కారం, జీడిపప్పులు, వెన్న వేసి బాగా కలిపి వేడి చేస్తే గ్రేవీలా తయారు అవుతుంది.
- Step 5
ఇప్పుడు పనీర్‌ను ముక్కలుగా కోసి వేయించాలి. ఇప్పుడు పైన తయారు చేసి ఉంచిన గ్రేవీలో ఈ ముక్కలను వేయాలి.
- Step 6
ఆ తర్వాత దానిలో తేనె, క్రీమ్, మెంతికూర పొడి కలపాలి. అంతే లక్నో స్పెషల్ అవధి పనీర్ రెడీ.