- Step 1
ముందుగా పనీర్ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.
- Step 2
తర్వాత టమాటాలు, గరంమసాలా, ఎండు మిరపకాయలు, పుదీనా, మెంతికూర, ఉల్లిపాయలను ముక్కలుగా కోసి కలిపి, కొంచెం ఉప్పు కూడా వేసి స్టౌమీద పెట్టి ఉడికించాలి.
- Step 3
తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి, దానికి అల్లం, వెల్లుల్లి ముద్దను కలిపి వేయించాలి.
- Step 4
ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా రసాన్ని కొంచెం కొంచెం వేస్తూ, నూనె తేలేవరకూ ఫ్రై చేస్తే గ్రేవీ తయారవుతుంది.
- Step 5
గ్రేవీకి రెడ్ ఆరంజ్ కలర్ కలిపి, తగినంత ఉప్పు వేసుకోవాలి.
- Step 6
అలాగే ముందుగా కట్ చేసిన పనీర్ ముక్కల్ని గ్రేవీలో కలిపి, పదినిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. *తరువాత వెన్న కలిపి దించి, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన జల్లాలి. అంతే ఎంతో రుచికరమైన బటర్ పనీర్ మసాలా రెడీ.