- Step 1
ముందుగా పెసరపప్పు కడిగి నీటిలో మూడుగంటలు నానబెట్టాలి.
- Step 2
తర్వాత నానిన పప్పును బాగా కడిగి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక బాణలీలో నెయ్యి వేడిచేసి గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్దను వేసి, నెయ్యి పైకి వచ్చేలా సన్నని మంటపై కలుపుతూఉంటే పెసరపప్పు ముద్ద పచ్చిదనం పోతుంది.
- Step 4
ఇప్పుడు దానిలో చెక్కెర, కోవా కలుపుకోవాలి.
- Step 5
చెక్కెర, కోవాలు కరిగి పలచగా తయారవుతాయి.
- Step 6
ఇది హల్వాముద్దలా గట్టిపడేవరకూ కలుపుతూవుండాలి.
- Step 7
ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు కొంచెం మిఠాయి రంగు, యాలకుల పొడి వేసి దించాలి.
- Step 8
ఇప్పుడు ఒక డిష్‌లో వేసి, పైన సన్నగా తరిగిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి.