- Step 1
ముందుగా కాకరకాయల్ని చాకుతో పైన చదును చేసి, మధ్యలో చీల్చి లోపలున్న గింజల్ని, తెల్లని పొరను స్పూనుతో తీసివెయ్యాలి. *తరువాత కాకరకాయ లోపల ఉప్పుతో బాగా రుద్దాలి.
- Step 2
కాకరకాయలను నీళ్లలో ఉడకబెట్టి, నీళ్ళు వంచేసి, మంచినీళ్లలో రెండుసార్లు కడిగి పక్కన ఓ గిన్నెలో ఉంచాలి.
- Step 3
ఇప్పుడు ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాగాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి, దానిలో శనగపిండిని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకూ సన్నని సెగ మీద ఫ్రై చెయ్యాలి.
- Step 4
ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపాక, టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలియబెడితే, కాకరకాయల్లో కూరడానికి మసాలా తయారవుతుంది.
- Step 5
ఇప్పుడు ఈ మాసాలకు తగినంత ఉప్పు చేర్చి, ఉడికించి ఉంచిన కాకరకాయల్లో కూర్చి కాకరకాయ విడిపోకుండా దారంతో కట్టాలి.
- Step 6
వీటిని అట్ల పెనం మీద నూనె పోసి ఎర్రగా కరకరలాడే వరకూ ఫ్రై చెయ్యాలి. అంతే కాకరకాయ కబాబ్ రెడీ.