- Step 1
ముందుగా కంద చెక్కు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి. తరువాత బచ్చలి కూరని కూడా సన్నగా తరగాలి.
- Step 2
రెండింటినీ శుభ్రంగా కడిగి పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని దించి, చిల్లుల పళ్లెంలో వేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న నీరు అంతా ఇంకిపోతుంది.
- Step 4
చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి ఉంచాలి. * ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి ముక్కలు వేసి అవి ఎర్రగా అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- Step 5
ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి.
- Step 6
అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే బచ్చలి కంద కూర రెడీ.