- Step 1
ముందుగా కప్పు నీరు పోసి బఠానీలను నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఉడికించాలి.
- Step 2
బౌల్‌లో 2 స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక ధనియాలు, ఇంగువ, 4 ఎండు మిరపకాయలు, శనగపప్పు వేసి వేయించాలి. *తరువాత కొబ్బరి తురుము, చింతపండు, కరివేపాకు కలిపి, పావుకప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
బౌల్‌లో టీ స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వేసి ఎండు మిరపకాయ వేసి తరువాత సగానికి చీలికలుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేయాలి.
- Step 4
మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ముక్కల్ని తీసి విడిగా పక్కన పెట్టుకోవాలి.
- Step 5
బౌల్‌లోఉప్పు, బెల్లం, మసాలా పేస్ట్ వేసి, నీరు పోసి తక్కువ మంటపై మగ్గనివ్వాలి.
- Step 6
చింతపండు పచ్చివాసన పోయేదాకా మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 7
వేరుశనగలు, క్యాప్సికం ముక్కలు వేసి సన్నని మంటపై చిక్కబడేదాకా ఉంచాలి. క్యాప్సికం-బఠానీ కూర రెడీ.