- Step 1
ముందుగా బొంబాయిరవ్వ, సేమ్యాలని విడివిడిగా రంగు మారేదాకా వేయించాలి.
- Step 2
ఇప్పుడు పెరుగులో రవ్వ, సేమ్యా, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఆ తర్వత నూనె వేడిచేసి అవాలు వేసి చిటపటలాడుతుండగా రవ్వ, సేమ్యా మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
- Step 4
ఒక్క పదినిమిషాలు పక్కన ఉంచితే రవ్వ నానుతుంది. మాములు ఇడ్లీలు మాదిరిగా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసి రవ్వ, సేమ్యా ఇడ్లీలు వేసుకోవాలి.
- Step 5
మిశ్రమం గట్టిగా అనిపిస్తే కొంచం నీరు కలపొచ్చు ఇడ్లీల పిండిలా జారుగా ఉండాలి.
- Step 6
ఈ మిశ్రమం కూడా రుచికి, క్యారట్ కోరి వేసుకోవచ్చు.
- Step 7
మిశ్రమాన్ని ఓ పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికిస్తే రుచిగా ఉండే రవ్వ, సేమ్యా ఇడ్లీ సిద్ధం.