- Step 1
ముందుగా చిన్న బంగాళదుంపలని కుక్కర్ లో ఉడికించి చెక్కుతీసి పెట్టుకోవాలి. ఆ సమయంలోనే టమాటను నీళ్ళల్లో ఉడికించాలి.
- Step 2
ఉల్లిపాయలని సన్నగా తరిగి వేయించాలి. ఆ తర్వాత చల్లారాకా టమాట చెక్కుతీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. * అలాగే ఉల్లిపాయలని కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. రెండు చెమ్చాల నూనె వేసి కాగాకా ముందుగా ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- Step 3
ఆ మిశ్రమం కొంచం ఎర్ర రంగుకి వస్తుండగా, పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
- Step 4
ఆ తరువాత టమాట గుజ్జు, పెరుగు, చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. గ్రేవీ ఉడుకుపట్టాకా ముందుగా ఉడికించి పెట్టుకున్న చిన్న ఆలులని డీప్ ఫ్రై చేసి ..చల్లారాక టమాట ,ఉల్లి గ్రేవీ లో వేసి ఓ పదిహేను నిమిషాలు మగ్గించాలి. దించేముందు కొత్తిమీర వేస్తే దమ్ ఆలూ కరీ సిద్ధం.