- Step 1
ముందుగా సొరకాయ(అనపకాయ)ను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి.
- Step 2
ఆ తురుములో సెనగపిండి, ఉప్పు, మెత్తగా గ్రైండ్ చేసిన అల్లం, వెల్లుల్ల్లి, పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసి కలపాలి.
- Step 3
సొరకాయలో నీరు వుంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది. *గట్టిపకోడిల పిండి మాదిరిగా రావాలి.
- Step 4
ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి వేడి నూనెలో ఎర్రగా వేయించి, గ్రేవీలో వేసి ఓ పదినిమిషాలు మగ్గిస్తే కద్దూ కోఫ్తా కర్రీ రెడీ అయినట్టే ఈ కూర చపాతిలలోకి బాగుంటుంది.
- గ్రేవీ తయారు చేసే విధానం:
- Step 5
ఒక గిన్నెలో నూనె పోసి వేడిచేశాకా ముందుగా ఉల్లిపాయలు ముక్కల్ని ఎర్రగా వేయించండి.
- Step 6
ఆ తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ధనియాలపొడి కలపాలి.
- Step 7
అలాగే టమాట ముక్కల్ని కూడా వేసి కాసేపు వేయించాలి.
- Step 8
ఆ తరువాత గసగసాలు, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఆ ముద్దని కూడా చేర్చాలి.
- Step 9
దించే ముందు పెరుగుని వేసి సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు ఉంచితే గ్రేవీ సిద్దమయినట్టే.