- Step 1
ముందుగా మొక్కజొన్న పొత్తులను ఒలిచి వాటి గింజలను కండె నుంచి తొలగించాలి.
- Step 2
తరువాత ఉల్లిపాయలను, కాప్సికమ్ బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఈ పచ్చి గింజలను మిక్సీలో వేసి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి.
- Step 4
ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మొక్కజొన్న మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికమ్, కరివేపాకు వేసి కలుపుకోవాలి.
- Step 5
తరువాత ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
- Step 6
ఒక్కొక్క ముద్దను ఆరచేతిలో వడలా నొక్కి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి.
- Step 7
అంతే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు రెడీ.