- Step 1
ముందుగా నూడుల్స్ ని ఉడకబెట్టి ఉంచుకోవాలి.
- Step 2
ఉడుకిన్చేతప్పుడు కొద్దిగా నూనె వేసి వాటిని కన్నాల గిన్నాలి వడబోసేటప్పుడు చల్ల నీళ్ళతో కడిగితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి.
- Step 3
తరువాత అన్ని కూరగాయల్ని పొడుగ్గా, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 4
ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్ పండుమిర్చి ముద్ద ఉప్పు వేసి అందులో కూరగాయ ముక్కలన్నిటిని వేసి ఆ పిండికి పట్టించి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి.
- Step 5
అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి అందులో మైదా కార్న్ ఫ్లోర్ పట్టించిన కూరల్ని వేసి కరకరలాడేలా వేయించాలి. నూడుల్స్ ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఇలా చేసిన తరువాత ఒక నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనే వేసి పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, అజినోమాటో వేసి కాస్త వేగనివ్వాలి.
- Step 7
అందులో కూరగాయముక్కల్ని వేసి 2 నిమిషాలు వేయించాకా చివరగా నూడుల్స్ ని కూడా వేసి వేయించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు. తాయి నూడుల్స్ మీ ముందు రెడీగా ఉంటాయి.