- Step 1
ముందుగా కాకరకాయలను కడిగి, తుడుచుకుని గుండ్రని చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
ఈ కూర తయారుచెయ్యటానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనే వేసి వేడెక్కాకా పోపు దినుసులు వేయాలి.
- Step 3
అవి వేగ్గకా ఇంగువ కరివేపాకు వేసి తరిగిన కాకరకాయ ముక్కలు వెయ్యాలి.
- Step 4
అందులో ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కాసిని నీళ్ళు పోసి మూట పెట్టి ముక్కలని మగ్గనివాలి.
- Step 5
ముక్క కాస్త మెత్తబడ్డాకా అందులో బెల్లం తురుము వెయ్యాలి.
- Step 6
అన్ని కలిసి కూర కాస్త పాకం పాటినట్లు ముద్దగా వస్తుంది.
- Step 7
అప్పుడు ఆమ్చూర్ పొడి, కారం వేసి అంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూట పెట్టి మగ్గనివ్వాలి.
- Step 8
ఇలా చేయటం వల్ల అన్ని రుచులు ఒకదానికి ఒకటి అంటుకుని మూట తీసేసరికి కూర ఘుమఘుమలాడుతూ ఉంటుంది.
- Step 9
షడ్రుచులతో కలగలిసి కాకరకాయ కూర అమోఘంగా ఉంటుంది. కావాలంటే మీరే రుచి చూసి చెప్పండి.