- Step 1
కాప్సికం కడిగి దాని తొడిమతో పాటు పై భాగాన్ని కొంత వరకు కట్ చెయ్యాలి.
- Step 2
లోపల ఉన్న విత్తనాల్ని చాకుతో మెల్లిగా తీసెయ్యాలి.
- Step 3
ఆ కాప్సికంలని నూనే వేసిన కడాయిలో వేసి ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు చాలు అవి మగ్గటానికి. వాటిని తీసి వేరే ప్లేట్ లో ఉంచాలి.
- Step 4
ఇప్పుడు అదే కడాయిలో నూనే వేసి పోపు దినుసులు వేసి చిటపటలాడాకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి.
- Step 5
ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి.
- Step 6
అంతా బాగా కలిపి అందులో ఉప్పు, కారం, గరం మసాలా పొడి, కసూరి మెంతి,కొత్తిమీర వేసి కలపాలి.
- Step 7
కూర రెడీ అయిన తర్వాత ముందుగా మగ్గించుకున్న కాప్సికంలో ఈ కూరని స్టఫ్ చేయాలి.
- Step 8
అప్పుడు కాప్సికం మాడిపోకుండా, పచ్చిగా లేకుండా చూడటానికి ఎంతో బాగుంటుంది. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టఫడ్ కాప్సికం కర్రీ రెడీ అయినట్టే.