- Step 1
ముందుగా దుంపల తోక్కతిసి చిన్నపాటి క్యూబ్ గా తరుగుకోవాలి. కొబ్బరి కోరు సిద్ధంగా ఉంచుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఓ దళసరి గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని అందులో బీట్ రూట్ ముక్కలు వేసి మూతపెట్టి చిన్న మంటపై 8 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- Step 3
తరువాత పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిఎక్కివెంటనే మినపప్పు , ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ చివరగా కరివేపాకు వేసి.. పోపు దోరగా వేగే సమయంలో కొబ్బరి కోరువేసి కొద్దిగా వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే కొబ్బరి కమ్మదనం పోయి పీచుగామారుతుంది.
- Step 4
కొబ్బటి తాజా సువాసనగా ఉండగా ఉడికి ఉమ్మగిల్లిన రూట్ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు జోడించాలి.
- Step 5
చిన్న మంటపై మూతపెట్టి 2,3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి.. కూరలో చాట్ మసాలా చల్లి నిమ్మరసం పై నుండి పోస్తూ కలపాలి.
- Step 6
చాలా చాలా రుచిగా తియ్యగా, కమ్మగా మధ్యలో పులుపు తగులుతూ ఈ కూరని అలాగే తినేయ్యచు ....వేడి అన్నంలో రోటితో చాలా బావుంటుంది.