- Step 1
ముందుగా ఉల్లిపాయలు,క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేరుసెనగ పప్పులు,నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్ ను విడివిడిగా వేయించుకోవాలి.
- Step 3
ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసిదాల్చిన చెక్క, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి.
- Step 5
తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్ కొద్దిగా నీళ్ళు వేసి ఉడకనివ్వాలి .
- Step 6
ఇప్పుడు ధనియాల పొడి,కారం వేసి పది నిముషాలు ఉడికించాలి.
- Step 7
చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిముషాలు ఉకించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.