- Step 1
ముందుగా బంగాళాదుంపను ఉడికించి పైన పొట్టు తీసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, షాజీరా, అన్నింటినీ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 3
తరవాత క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటిలో కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 4
బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు దోరగా వేయించి మసాలా ముద్ద, ఉప్పు వేసి రెండు నిముషాల తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలు వెయ్యాలి.
- Step 5
బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలను తడిపి నీటిని పిండి క్యాలీఫ్లవర్ వేపుడులో వేసి కలుపుకోవాలి.
- Step 6
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 7
ఇప్పుడు బంగాళాదుంప ముద్దకు ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా వెన్న చేర్చి బాగా మిక్స్ చేసుకుని పెద్ద ఉండగా చేసుకొని మధ్యలో క్యాలీఫ్లవర్ ఉండలు పెట్టి కబాబ్ లుగా చేసి బ్రెడ్ పొడిలో అద్దాలి.
- Step 8
ఇప్పుడు వీటిని పెనం మీద నూనెతో బ్రౌన్ కలర్ వచ్చెవరకు రెండువైపులా కాల్చుకోవాలి. కాలీఫ్లవర్ కబాబ్ రెడీ...