- Step 1
ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడిగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక మద్యకు పొడవుగా కట్ చేసి గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి మెత్తగా చేసుకుని ఇందులో కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు వేసి బాగా కపుకోవాలి.
- Step 3
మిర్చి ఎన్ని వున్నాయో అన్నీ బాగాలుగా కలిపినా మిశ్రమాన్నీ ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి.
- Step 4
ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్నినీళ్ళుపోసి ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- Step 6
తరువాత స్టవ్ వెలిగించి నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.