- Step 1
ముందుగా బియ్యం కడిగి ఒక 15 నిముషాలు నానబెట్టుకోవాలి.
- Step 2
తరువాత పనీర్ ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం, గరంమసాలా పొడి వేసి కలిపి కొంచంసేపు పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి లవంగాలు,బిర్యానీ ఆకు, షాజీర,దాల్చిన చెక్క, వేసి వేగాకా ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- Step 4
తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత ఉడికించి పేస్ట్ చేసుకున్న టమాటమిశ్రమం, కొత్తిమిర పుదినా కూడా వేసి వేయించుకోవాలి.
- Step 5
ఇప్పడు పనీర్ ముక్కలు వేసి కారం,పసుపు, గరంమసాలా పొడి వేసి కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగాకా బియ్యం,సరిపడా ఉప్పు ఉడకనివ్వాలి.
- Step 6
స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొత్తిమిరతో అలంకరించుకోవాలి. స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి.