- Step 1
ముందుగా గోంగూరను శుభ్రం చేసుకోవాలి. శనగపప్పు విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టౌవ్ పై గిన్నె పెట్టి అందులో నూనె వేసి ,వెల్లుల్లి, జీల కర్ర, ఆవాలు, మినప్పప్పు,పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించాలి.
- Step 3
ఆవాలు వేగిన తర్వా త ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి.
- Step 4
వేగిన తర్వాత గోంగూర వేసి నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికించాలి.
- Step 5
గోంగూర బాగా ఉడికిన తర్వాత ముం దుగా ఉడికించి పెట్టుకున్న శెనగపప్పు వేసి తర్వాత ఉప్పు, కారం వేసి మరో కొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి....