- Step 1
పచ్చిబఠాణి ఉడకబెట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి . క్యారెట్, బీట్రూట్, ఆలూ లను పొట్టు తీసి శుభ్రం చేసుకుని కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టాలి.టమోటాలను కట్ చేసిపెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,కరివేపాకులతో తాలింపు పెట్టి దానిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత టమోటా ముక్కలను కూడా వేయించుకోవాలి .
- Step 3
తరువాత దానిలో అల్లం పేస్ట్, కారం, పసుపు వేసిబాగా కలపాలి .
- Step 4
ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠాణిలు, కూరగాయలు వేసి వేసి బాగా కలిపి సరిపడా నీళ్ళు పోసి , తగినంత ఉప్పు కూడా వేసుకుని గ్రేవీ చిక్కబడేవరకు ఉడికించుకుని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. చివరిలో కొత్తిమిర వేసుకోవాలి.