- Step 1
ముందుగా కుక్కర్‌లో సగానికి కోసిన ఆలుగడ్డలు ఉడికించి పొట్టుతీసి ప్రక్కనపెట్టుకోవాలి.
- Step 2
చపాతీ పిండిలో చిటికెడు ఉప్పు, చెంచా నూనె వేసి పరోటాల కొరకు మెత్తగా పిండి కలుపుకోవాలి.
- Step 3
ఉల్లిముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము, ఉప్పు, కారం కొత్తిమీరతరుగు అన్నీ కలుపుకుని బాగా అదిమిన ఆలుగడ్డల ముద్దలో కలుపుకోవాలి...
- Step 4
ఆలుగడ్డలు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకున్నట్లైతే చేతితో లేక గ్రీటర్‌తో మెత్తగా అదమవచ్చును.
- Step 5
ఈ ముద్దని చిన్న పూరీ సైజులో ఒత్తుకున్న పరోటా మధ్యలో పెట్టి ముట్టు మూసివేసి ఆ ముద్దను చేతితో బిళ్ళలా అదిమి అప్పడాల కర్రతో మెల్ల మెల్లగా బత్తుకుని పెనంపై చిన్నమంటతో దోరగా కాలేలా నూనె (లేక) బటర్ రాస్తూ కాల్చుకోవాలి.
- Step 6
ఈ ఆలూ పరోటాలు వేడిగా తింటే రుచిగా ఉంటాయి. వీటికి కూర అవసరంలేదు. కమ్మని పెరుగు కొద్ది పచ్చడి (లేక) సాస్‌తో తింటే ఎంతో బావుంటాయి.