- Step 1
గోధుమపిండిలో నీళ్లు వేసి చపాతీపిండి మాదిరిగా కలిపి, ఓ అరగంట పాటు అలా వదిలేయాలి.
- Step 2
ఈలోపు బంగాళాదుంపను ఉడికించి, తొక్క తీసి, మెత్తగా చిదుముకోవాలి.
- Step 3
మిగతా కూరగాయలన్నికీ నీటిలో వేసి మెత్తబడేవరకూ ఉడికించాలి.
- Step 4
తర్వాత వాటన్నిటికీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 5
బంగాళాదుంప, కూరగాయల ముద్దలో నూనె/నెయ్యి తప్ప మిగతా పదార్థాలన్నిటినీ వేసి కలపాలి.
- Step 6
గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి.
- Step 7
దీని మధ్యలో పై మిశ్రమాన్ని పెట్టి, అన్ని వైపుల నుంచీ మూసివేసి, మళ్లీ ఉండ చుట్టాలి.
- Step 8
దీన్ని మళ్లీ ఒత్తుకుని నూనె లేక నెయ్యి వేసి కాల్చుకోవాలి.