- Step 1
శనగల్నిరెండు మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి.
- Step 2
ఉదయం కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
- Step 3
పాలకూరను శుభ్రంగా కడిగి ఉడికించాలి. తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి.
- Step 5
స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక యాలకులు, మిరియాలు వేయాలి.
- Step 6
ఓ నిమిషం తరువాత టొమాటోలు కూడా వేసి ముక్క మెత్తబడేవరకూ వేయించాలి.
- Step 7
తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి.
- Step 8
ఆపైన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేయాలి.
- Step 9
ఓ నిమిషం పాటు వేయించాక శనగలు వేయాలి. మసాలా అంతా శనగలు బాగా పట్టేలా కలుపుతూ కాసేపు వేయించాలి.
- Step 10
శనగలు కాస్త రంగు మారిన తరువాత పాలకూర పేస్ట్ వేయాలి.
- Step 11
పేస్ట్ మరీ గట్టిగా ఉంటే కాస్త నీళ్లు పోసి మూత పెట్టాలి.
- Step 12
కూర బాగా ఉడికి దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది.