- Step 1
లేత అనపకాయను, తీసుకుని, దాన్ని పొట్టు ఉండ గానే కత్తి తో గాట్లు కానీ, చిల్లులు కానీ పెట్టుకోవాలి.
- Step 2
ఆ తరువాత పొట్టు తీసేసి, పెద్ద ముక్కలు తరగాలి. ఈ ముక్కలను, ఉప్పు వేసి కలిపి ఆవిరి మీద ఉడికించాలి. ముక్క లు ఉడకగానే , చింత పండు రసం లో తగినంత నీళ్లు కలిపి ఈ రసం ముక్కల్లో వేసి ఉడికించాలి.
- Step 3
ఈ పులుసు ఉడుకుతూఉండగా ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు పొడి చేసుకుని, ఈ పొడి తో బాటు , దాలిచిన పొడి, కొబ్బరి పొడి , గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా కలిపి అయిదు నిమిషాలు ఉడికించి స్టవ్ పై నుంచి దింపాలి.
- Step 4
ఈ పులుసు లో, కొత్తిమీర, కరివేపాకు వెయ్యాలి.
- Step 5
ఈ పులుసు లో, కొత్తిమీర, కరివేపాకు వెయ్యాలి.
- Step 6
ఆనపకాయ గుచ్చి పులుసు తయ్యార్.
- Step 7
ఇది, అన్నం తో గానీ, చపాతీ తో కానీ సర్వ్ చేస్తే బావుంటుంది.