- Step 1
మైదాలో నెయ్యి, బేకింగ్ సోడా, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప, నీళ్ళు వేసి చపాతి పిండిలా కలుపుకొని అరగంట పక్కనపెట్టాలి.
- Step 2
పాన్‌లో కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారట్, క్యాప్సికమ్ వేసి దోరగా వేయించాలి.
- Step 3
ఉడికించిన సేమ్యా, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో వేసి రెండు నిముషాలు వేయించాలి.
- Step 4
ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ఒక పూరీపై కూర మిశ్రమాన్ని పెట్టి మరో పూరీతో మూసి చుట్టూ అంచులు విడిపోకుండా తడి అద్ది, గట్టిగా ఒత్తి వేడి నూనెలో వేసి, నిదానంగా కరకరలాడే వరకు వేయించుకోవాలి. అంతే రుచికరమైన పొటాటో సేమ్యా కచోరీ రెడీ