- Step 1
ముందుగా రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు మందపాటి డీప్ బాటమ్ పాత్రను స్టౌ మీద పెట్టి ఆయిల్ , నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, చెక్క, లవంగాలు మరియు యాలకులు వేసి వేయించాలి.
- Step 3
అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి.
- Step 4
ఉల్లిపాయ ముక్కలు రంగు మారే సమయంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు టమోటో వేసి, టమోటో మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
- Step 5
తర్వాత మొక్కజొన్న గింజలు, పసుపు, కారం, కొబ్బరి పాలు మరియు ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు వేయించాలి. ఈ మిశ్రమం అంతా చిక్కబడేంత వరకూ వేయించుకోవాలి.
- Step 6
ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసి ఈ గ్రేవీని బాగా ఉడికించాలి. తర్వాత ఇందులో బాస్మతి బియ్యాన్ని, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి బాగా ఉడికించాలి. అంతే కార్న్ బిర్యానీ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.