- Step 1
ముందుగ ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో పనీర్, ఉప్పు వేసి ఉడికించి, చల్లారక నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత టమాటో ప్యూరి ( టమాట ఉడికించి తొక్క తీసి మెత్తగా రుబ్బాలి ) తయారుచేసుకోవాలి.
- Step 3
రెండు ఉల్లిపాయల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
- Step 4
బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
- Step 5
తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద, టమాటో గుజ్జు కలపాలి.
- Step 6
నూనె పైకి తేలాక ధనియాల పొడి, శెనగపొడి, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, కప్పు నీళ్ళు వేసి మూతపెట్టాలి.
- Step 7
గ్రేవి తయారయ్యాక ఉడికించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి ఐదు నిముషాలు స్టవ్ మీద ఉంచాలి.
- Step 8
చివరిగా కొత్తిమీర చల్లి దించేయాలి. పూరీలు, చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.