- Step 1
ముందుగా మిల్ మేకర్ ని మరిగించిన నీటిలో వేసి రెండు నిముషాలు వుంచి తరువాత.
- Step 2
ఆ నీటిని పిండి కీమాలాగా చిన్నగా కట్ చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు మసాలకోసం జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 4
తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగనివ్వాలి.
- Step 5
ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గాక మసాలా పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళుపోసి ఐదు నిముషాలు ఉడికించాలి.
- Step 6
ఆ తరువాత మిల్ మేకర్ కీమా,వేసి ఉడికించి గరంమసాలా వేసి ఒక రెండు నిముషాలు ఉడికించాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర వేసి రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేయవచ్చు...