- Step 1
పనీర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఉల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచం సేపు వేగనివ్వాలి.
- Step 3
బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ధనియాలపొడి, పసుపు, ఉప్పు,కారం, ఆవపొడి, వేసి కలపాలి ఐదు నిమిషాల వేగనివ్వాలి. ఇందులో పోసి ఒక నిమిషం పాటు తిప్పాలి.
- Step 4
తర్వాత మీగడ వేసి పదార్ధాలన్నింటినీ మరొక ఐదు నిమిషాల పాటు వేయించాలి.
- Step 5
తర్వాత తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఉడకబెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి మూత పెట్టాలి.
- Step 6
స్టవ్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా చివరిలో కొత్తిమిర వేసి దించేయాలి...