- Step 1
ముందుగా ఉద్దిపప్పును 2-3గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు పిండితో మిక్స్ చేయడానికి ముందు ఇడ్లీ రవ్వను కూడా విడిగా కొద్దిగా నీళ్ళుపోసి అందులో నానబెట్టుకోవాలి.
- Step 2
రెండు గంటల తర్వాత ఉద్దిపప్పులోని నీరు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇడ్లీ రవ్వలోని నీటిని వంపేసి, నీటినంతటినీ పిండేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకొన్ని ఉద్దిపప్పు పిండిలో మిక్స్ చేయాలి. చేత్తో బాగా కలుపుకోవాలి.
- Step 4
కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి రాత్రంతా మూత పెట్టి అలాగే ఉంచాలి. శీతాకాలంలో పిండి పులవడానికి ఎక్కువ సమయంకావాలి. అదే సమ్మర్ లో అంత సమయం అవసరం లేదు 4-5గంటలు పులియబెడితే చాలు.
- Step 5
ఇప్పుడు కావల్సినంత పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయలి. అలాగే ఇందులోని పేస్ట్ చేసుకొన్న కొత్తిమీర పేస్ట్ ను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇడ్లీలు చేయడానికి రెడీ.
- Step 6
ఇప్పడు ఇడ్లీ ప్లేట్స్ లో కొద్దిగా నూనె రాసి అరచెంచా క్యారెట్ తురుమును మొదట నింపుకోవాలి. దాని మీద ఇడ్లీ పిండి వేసుకోవాలి.
- Step 7
తర్వాత పిండి మీద కూడా మరికొంత క్యారెట్ తురుమును సర్దుకోవాలి. తర్వాత ప్లేట్స్ అన్నీ ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి 10-15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి వేడి వేడి ఇడ్లీని సాంబార్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.