- Step 1
ముందుగా గ్రేవీని తయారుచేసుకుందాం. దీనికోసం టమాటా, అల్లం ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 3 స్పూన్స్ నూనే వేసి పోపు దినుసులు వేసి అవి వేగాకా అందులో టమాటా ప్యూరిని వేసి వేగనివ్వాలి. కాస్త పచ్చిదనం పోయేదాకా ఉంచాలి.
- Step 3
అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి కొత్తిమీర తురుము వేసి కాసేపు ఉంచి ఆపేయ్యాలి. కాస్త వెరైటీ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఉల్లి పేస్టుని కూడా కలుపుకోవచ్చు.
- Step 4
ఇప్పుడు కోఫ్తాల తయారి కోసం ఒక డిష్ లో సన్నగా తరిగిన క్యాబేజీ వేసి అందులో సెనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి నీళ్ళు పోసి కలపాలి.
- Step 5
పిండి ఉండ చుట్టటానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి.
- Step 6
ఆ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజులో గుండ్రని ఉండల్లా చుట్టుకోవాలి.
- Step 7
ఇలా తయారయిన వాటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసి ముందుగా తయారుచేసి పెట్టుకున్న గ్రేవీలో వేయాలి. ఉండలన్నిటికి గ్రేవీ పట్టేలా కదుపుకోవాలి. అంతే ఏంతో రుచికరమైన క్యాబేజీ కోఫ్తా కర్రీ రెడీ అయినట్టే.