- Step 1
ఆనపకాయ ముక్కల్ని కాస్త పెద్దగా క్యూబ్స్ లాగా తరుగుకొని ఉడికించాలి .
- Step 2
మిక్సీలో ఉల్లి, టమాటా ముక్కల్ని మెత్తని గుజ్జుగా రుబ్బుకోవాలి .
- Step 3
ప్రక్కన వెల్లుల్లి, జీలకర్ర దంచి మరీ మెత్తగా కాకుండా సిద్ధం చేసుకోవాలి .
- Step 4
దళసరి గిన్నె (లేదా) మూకుడు వేడిచేసి అందులో నూనెవేసి కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి నిలువుగా తరిగిన ముక్కలు, కరివేపాకు వేసి, వెల్లుల్లి ముద్దవెయ్యాలి .
- Step 5
కొద్దిగా వేగనిచ్చి ఉల్లి, టమాటా గుజ్జువేసి చింతపండు రసం, పసుపు, ఉప్పు జోడించి మూతపెట్టి మగ్గనివ్వాలి.
- Step 6
ఈలోగా వేడినీటిలో మిల్ మేకర్ నానబెట్టి.. నీరు వార్చేసి ఆ మిల్ మేకర్స్ వేసి కలిపి చివరగా ఉడికించిన ఆనపముక్కలు కలిపి, గరంమసాలా వేసి చక్కగా అన్నీ కలుపుకుని మరో 10నిముషాలు చిన్న మంటపై ఉడికించుకోవాలి .
- Step 7
కూర పలుచగా పులుసుగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళు జోడించి ఉడికించుకుని కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
- Step 8
ఈ గ్రేవి ఇంకా బావుండాలి అనుకొంటే జీడిపప్పు పొడి లేక ముద్దని, టమాట ఉల్లిగుజ్జుతో జోడించి ఉడికించుకోవాలి.
- Step 9
చాలా రుచిగా ఉండే ఈ కూర చపాతిలతో, జీరారైస్ లోకి చాలా చాలా బావుంటుంది.