- Step 1
ముందుగా బేబి కార్న్‌ను చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు వేసిన నీటిలో ఉడికించి ఒక ప్లేట్ లోపెట్టుకోవాలి.
- Step 2
తరువాత ఒక గిన్ని తీసుకుని కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, కారం, అల్లంపేస్ట్ , ఉప్పును వేసి పిండిని కొంచం గట్టిగా కలుపుకోవాలి.
- Step 3
స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి.
- Step 4
ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలో ఉడికించుకున్న బేబి కార్న్‌ను వేసి యిల్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- Step 5
తరువాత స్టవ్ పై పాన్ పెట్టుకుని కొంచం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, దోరగా వేయించుకోవాలి.
- Step 6
అందులో వేయించి పెట్టుకున్న బేబికార్న్ ముక్కలను వేసి కలపాలి.
- Step 7
ఇప్పుడు సోయాసాస్, చిల్లీసాస్, టొమాటో సాస్ వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి...