- Step 1
ముందుగా బెండకాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మద్యలో చిన్నగాటు పెట్టాలి.
- Step 2
అందులో ఛాట్ మసాలా పొడి,కారం కలిపి కట్ చేసుకున్న ముక్కల్లో పెట్టి పైన శెనగ పిండి చల్లి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి వేడెక్కాక బెండకాయ ముక్కలు వేయించి తీసి ప్లేట్ లో పెట్టాలి .
- Step 3
తరువాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో టమాటో ముక్కలు ,ఎండు మిరపకాయలు ,గరం మసాలా ,పుదీనా ఉడికించాలి.
- Step 4
ఇప్పుడు ఉడికించుకున్నవాటిని మిక్సిలో వేసి పేస్ట్ చేసుకోవాలి .
- Step 5
స్టవ్ వెలిగించి అదే పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి .
- Step 6
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు టమాటో కూడా వేసిపది నిముషాలు వేయించాలి .
- Step 7
జీడిపప్పుని పేస్ట్ కూడా వేసి గ్రేవీ చిక్కబడిన తరువాత బట్టర్ ని వేసి సాల్ట్ వేసి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. బెండకాయ మసాలా గ్రేవీ రెడీ.