- Step 1
వంకాయలకి కొద్దిగా నూనె రాసి చాకుతో గాట్లు పెట్టి స్టవ్ మీద కాల్చి మెత్తగా అయిన తరవాత తీసి పైన చల్లటి నీళ్లు చల్లి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలు, టొమాటోలు సన్నగా విడివిడిగా తరగాలి.
- Step 2
బాణలిలో నూనె వేసి లవంగాలు, దాల్చినచెక్క వేయించి తీయాలి.
- Step 3
ఆవాలు, మెంతులు వేసి అవి కూడా వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి అందులో టొమాటో ముక్కలు వేసి ఉప్పు, పసుపు, పంచదార వేసి మూతపెట్టాలి.
- Step 4
మెత్తగా అయిన తరవాత దించి పక్కనపెట్టాలి. తరవాత వంకాయలు తొక్క తీసి రోటిలో వేసి మెత్తగా గుజ్జులా చేసి టొమాటోల్లో కలపాలి.
- Step 5
లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసి వేయాలి. ఆపైన కొత్తిమీర సన్నగా తరిగి కలిపితే బెంగాలీలు ఎక్కువగా వండే బైంగన్‌కా బర్తా సిద్ధం.