- Step 1
మైదాపిండిలో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. నీటిలో కాస్తంత ఉప్పు, చక్కెరను కలిపి కరిగిన తరువాత ఆ నీటిని మైదాపిండిలో పోసి బాగా మెత్తగా ముద్ద చేసుకోవాలి.
- Step 2
మైదాపిండి ముద్దపై కాస్తంత నూనెను రాసి ఒక తడిగుడ్డను కప్పి ఉంచాలి.
- Step 3
కుక్కర్‌లో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా వేయించాలి.
- Step 4
తరువాత పైన సన్నగా తరిగి ఉంచుకున్న పదార్థాలు, మిగిలిన పదార్థాలు అన్నింటినీ ఒకటి తర్వాత ఒక్కోటి వేస్తూ బాగా వేయించాలి.
- Step 5
చివర్లో వీటికి టమోటో ముక్కలను కూడా కలిపి వేయించాలి. అందులోనే ధనియాలపొడి, మిరపపొడి, పసుపుపొడి, ఉప్పు లాంటివి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
- Step 6
కావాల్సినంత నీటిని అందులో పోసి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాలను వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి, దించేయాలి.
- Step 7
పై పదార్థాలన్నీ ఉడికేలోపు కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలాగా వత్తుకోవాలి.
- Step 8
స్ర్పింగ్ రోల్స్ కొసలు మూసేందుకుగాను మైదాపిండి నీటిలో చిక్కగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 9
కుక్కర్‌లో ఉడికించిన పదార్థాలను వత్తుకున్న పూరీలలో కొద్ది కొద్దిగా పెట్టి రోల్స్ లాగా తయారు చేసుకోవాలి.
- Step 10
ఇలా చేసుకున్న వాటిని పైన కలిపి ఉంచిన చిక్కటి మైదా పిండితో రోల్స్ కొసలను మూసేయాలి.
- Step 11
ఇలా పిండి మొత్తం రోల్స్ లాగా తయారు చేసుకున్న తరువాత వాటిని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీయాలి. అంతే వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. వీటిని ఏదైనా సాస్‌తో కలిపి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.