- Step 1
ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసి కాడలు వొలిచి పక్కన పెట్టాలి. వీటిని బాగా ఆరనీయాలి.
- Step 2
ఒక పాత్రలో పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమానికి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి.
- Step 4
తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి నెయ్యిని వేడి చేయాలి.
- Step 5
ఈలోగా పై మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
- Step 6
వాటిని నేతిలో దోరగా వేయించి వేరే పాత్రలోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయాలి. ఈ పుట్టగొడుగుల ఫ్రైలో చిల్లీ లేదా టొమాటో సాస్ ను వేసుకుంటే బావుంటుంది.