- Step 1
ఉల్లిపాయలు సన్నగా తరగాలి. అల్లం, జీలకర్ర, కారం , ఉప్పు, ఉల్లిముక్కలు, కలపి దంచాలి.
- Step 2
చివరలో కొబ్బరి తురుము వేసి తీయాలి. మిక్సీలో అయితే మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా తీయాలి.
- Step 3
ఇష్టమయిన వారు వెల్లుల్లి 10 రెబ్బులు కూడా వేసి దంచి మసాలా తయారుచేయాలి.
- Step 4
బీరకాయ తొక్కుతీసి కాయను నాలుగు పక్షాలుగా గుత్తిలాగా చేసి దాంట్లో ఈ మసాలాను కూరాలి.
- Step 5
బాండీలో నూనె వేడి చేసి తాలింపు వేసి గుత్తి బీరకాయలను వేసి పసుపు కూడా వేసి మూత బదులు డిష్ లాంటిది పెట్టి దాంట్లో నీరు పోసి సన్నని మంట మీద మగ్గనివ్వాలి.
- Step 6
చింతపండు గుజ్జు జత చేయాలి మద్య మధ్య కూరని కదిలిస్తూ ఉండాలి.
- Step 7
నీరు ఇగిరి నూనె పైకి తేరిన తరువాత దించి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేయాలి.