- Step 1
ముందుగా అరకప్పు నీళ్లలో కందిపప్పు, శెనగపప్పుల్ని గంటసేపు నానబెట్టాలి.
- Step 2
అల్లం, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నానబెట్టిన పప్పులు... అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి కాసేపు కదపకుండా పక్కన పెట్టాలి.
- Step 4
స్టవ్‌మీద బాణలి పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకులతో తాలింపు పెట్టిన తరువాత బూడిద గుమ్మడి ముక్కల్ని కూడా వేసి నీళ్లు పోసి మూతపెట్టి మంటను తగ్గించి ఉడికించాలి.
- Step 5
ముక్కలు ఉడికాక పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఐదు నిమిషాలసేపు స్టవ్‌మీద ఉంచి దించేయాలి. అంతే మోర్‌కుళంబు రెడీ.